పంటలను కాపాడేందుకు ఎస్సారెస్పీ నీటి విడుదల,రైతులు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలి: తాజా మాజీ ఎంపీపీ ఆరెల్లి దేవక్క కొమురయ్య గౌడ్,
అర్జున్ సమాచారం// అక్టోబర్ 10//రామగిరి రిపోర్టర్.
వర్షాకాలంలో సాగు చేసిన పంటలను కాపాడేందుకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ) నుంచి శనివారం నీటిని విడుదల చేసినట్లు రామగిరి మండల తాజా మాజీ ఎంపీపీ ఆరెల్లి దేవక్క కొమురయ్య గౌడ్ తెలిపారు. రేవెల్లి డిస్ట్రిబ్యూటరీ ద్వారా డీ-86, డీ-83 కాలువల నుంచి సోమవారం వరకు పంటలకు నీరందనున్నట్లు పేర్కొన్నారు.
పంటలు చేతికొచ్చే వరకు రైతులకు అండగా ఉండేందుకు కృషి చేస్తామని ఆమె తెలిపారు. రైతులు అందుబాటులో ఉన్న సాగునీటిని పొదుపుగా వినియోగించుకొని పంటలను కాపాడుకోవాలని సూచించారు. రైతుల పంటలకు నీరందించేలా నీటి విడుదలకు సహకరించిన రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.